హైదరాబాద్‌లో మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై చర్యలు కొనసాగుతున్నాయి. మియాపూర్‌లోని అల్విన్ కాలనీ సమీపంలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ S.O.T పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఒడిశాకు చెందిన సోనియా ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మి, దుర్గప్రసాద్, దుర్గ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన 1.6 కిలోల హ్యాష్ ఆయిల్ స్వాధీనం అయ్యింది. కేసు మియాపూర్ పోలీసులకు బదిలీ అయ్యింది, విచారణ కొనసాగుతోంది.

