Hyderabadలో గ్యాస్ కొరత కారణంగా పలు హోటళ్లు, హాస్టళ్లు మరియు మెస్‌లు మెనూలో మార్పులు చేస్తున్నారు. Iran–Israel–United States మధ్య ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు.
దీంతో ఎక్కువ సమయం పట్టే దోశ, పూరి, వడ, టీ, కాఫీ, చపాతీ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది.ప్రస్తుతం పలు పీజీ హాస్టళ్లు, మెస్‌లలో అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి సులభంగా తయారయ్యే వంటకాలను మాత్రమే వడ్డిస్తున్నారు. పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగితే హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఇక రవాణా ఛార్జీలు పెరగడంతో కొన్ని హోటళ్లు ధరలు కూడా పెంచాయి. దోశ, పూరి, వడలపై కనీసం ₹15, ఇడ్లీ, ఉప్మా వంటి వంటకాలపై ₹10 వరకు ధరలు పెంచినట్లు సమాచారం.
