హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్ ల్యాండ్‌ఫిల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మీథేన్ వాయువు విడుదల చేస్తున్న టాప్ 25 చెత్త డంప్ యార్డ్స్ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. తాజా అధ్యయనం ప్రకారం, ఈ డంప్‌యార్డ్ నుంచి ప్రతి గంటకు సుమారు 5.9 టన్నుల మీథేన్ విడుదలవుతోంది.

ఇదే జాబితాలో ముంబైలోని కాంజుర్మార్గ్ ల్యాండ్‌ఫిల్ 12వ స్థానంలో ఉంది. నిపుణుల ప్రకారం, ఒక్క గంటకు 5 టన్నుల మీథేన్ విడుదలైతే అది సుమారు 10 లక్షల SUVs వల్ల కలిగే కాలుష్యానికి సమానమని చెబుతున్నారు.మీథేన్ వాయువు CO₂ కంటే దాదాపు 86 రెట్లు ఎక్కువ హానికరమైనదిగా గుర్తించబడింది. దీంతో నగర చెత్త నిర్వహణ సమస్య ఇప్పుడు గ్లోబల్ క్లైమేట్ థ్రెట్‌గా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
