కలెక్టర్‌కు రెండు అనుమానాస్పద ఐడీ కార్డులు చూపించిన వ్యక్తి
విచారణ తర్వాత నకిలీవని తేలడంతో కేసు నమోదు
మెదక్: ఇంటెలిజెన్స్, ఇంటర్‌పోల్ అధికారినంటూ చెప్పుకుంటూ అనుమానాస్పద ఐడీ కార్డులు చూపించిన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిపై Medak police కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన బుక్కా సంతోష్ ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్నారు.
భూ వివాదంపై కలెక్టర్‌కు వినతిపత్రం
భూ వివాదానికి సంబంధించిన అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు సంతోష్ తన స్నేహితుడు శ్రీనాథ్‌తో కలిసి సోమవారం మెదక్ కలెక్టరేట్‌కు వెళ్లారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిశారు.
ఇంటర్‌పోల్ అధికారినంటూ ఐడీ కార్డులు
తాను ఇంటర్‌పోల్ అధికారినంటూ సంతోష్ కలెక్టర్‌కు రెండు ఐడీ కార్డులు చూపించారు. వాటిపై అనుమానం రావడంతో కలెక్టర్ ప్రతిమా సింగ్.. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్‌తో పాటు ఇతర అధికారులను విచారణ చేయాలని ఆదేశించారు.
అర్ధరాత్రి వరకు విచారణ
సోమవారం అర్ధరాత్రి వరకు Medak police సంతోష్ వద్ద ఉన్న ఐడీ కార్డులపై సమగ్రంగా విచారణ చేపట్టారు. అవి నకిలీవని తేలడంతో సంతోష్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.



