విద్యార్థి డైరీలో ‘రీడ్ కలామా’, ‘దీనియత్’ హోంవర్క్ నమోదు
పొరపాటున నమోదు చేశామని పాఠశాల వివరణ.. ఘటనపై పోలీసుల విచారణ
Hyderabad: హైదరాబాద్‌లోని ఓ School లో విద్యార్థి హోంవర్క్ డైరీలో ఇస్లామిక్ మతానికి సంబంధించిన సూచనలు నమోదు కావడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కేసుకు సంబంధించిన వాస్తవాలను పరిశీలిస్తూ విచారణ చేపట్టారు.
విద్యార్థి బంధువు సుప్రియా గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి స్కూల్ డైరీని పరిశీలించగా ఉపాధ్యాయుడు హోంవర్క్‌గా “Read Kalama”, **”Deeniyath”**తో పాటు మరికొన్ని సూచనలు నమోదు చేసినట్లు గుర్తించామని తెలిపారు.
పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఇస్లామిక్ సాహిత్యాన్ని తప్పనిసరిగా చదవాలని ఒత్తిడి చేస్తోందని ఆమె ఆరోపించారు. ఇది విద్యార్థులపై పరోక్షంగా ప్రభావం చూపే ప్రయత్నమని, ఒక రకమైన బ్రెయిన్‌వాషింగ్‌గా భావిస్తున్నామని అన్నారు.
ఈ అంశాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని సుప్రియా గౌడ్ వెల్లడించారు.
అయితే ఈ ఆరోపణలను School యాజమాన్యం ఖండించింది. Deeniyath అనేది ముస్లిం విద్యార్థుల కోసం మాత్రమే ఉండే సబ్జెక్ట్ అని స్పష్టం చేసింది.
హోంవర్క్‌ను విద్యార్థుల డైరీల్లో నమోదు చేసే సమయంలో ఉపాధ్యాయుడి నుంచి అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల ఆ సూచనలు సంబంధిత విద్యార్థి డైరీలో నమోదయ్యాయని యాజమాన్యం వివరించింది.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అన్ని వివరాలను ధృవీకరిస్తున్నామని, విచారణ పూర్తైన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.



