శ్రీరామ నవమి శోభాయాత్రకు కట్టుదిట్టమైన భద్రత CP సజ్జనార్

March 24, 2026 11:01 AM

హైదరాబాద్‌లో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను ప్రశాంతంగా, సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.

ఈ ఏడాది శోభాయాత్ర భద్రత కోసం సుమారు 3000 మంది పోలీసులను మోహరించనున్నట్లు వెల్లడించారు. చైన్ స్నాచింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ ప్రత్యేకంగా పని చేస్తాయని చెప్పారు.డ్రోన్ల ద్వారా యాత్రను పర్యవేక్షించడంతో పాటు, మార్గమంతా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ఈసారి శోభాయాత్రను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media