ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా వివాహం చేసుకుని ఇద్దరు ఉన్నతాధికారులు సమాజానికి సరికొత్త సందేశాన్ని ఇచ్చారు. చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.
చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన శేషాద్రిని రెడ్డి (IPS) ప్రస్తుతం కుత్బుల్లాపూర్ DCPగా పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి (IAS) ప్రస్తుతం శిక్షణలో (ట్రైనింగ్) ఉన్నారు.
లక్షలాది రూపాయల ఖర్చు, ఆర్భాటాలకు తావివ్వకుండా కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది ఉన్నతాధికారుల సమక్షంలో చట్టబద్ధంగా ఒక్కటయ్యారు. ఉన్నత పదవుల్లో ఉండి కూడా ఇంత సాధారణంగా వివాహం చేసుకోవడంపై నెటిజన్లు, ప్రముఖులు ఈ యువ జంటను అభినందిస్తున్నారు.
TG:చౌటుప్పల్ రిజిస్టర్ ఆఫీస్ IAS, IPS అధికారుల ఆదర్శ వివాహం
