ఐఐటీ హైదరాబాద్‌లో 15వ స్నాతకోత్సవం.. 1,398 మంది విద్యార్థులకు డిగ్రీలు

July 18, 2026 10:17 AM
IIT Hyderabad convocation ceremony with graduating students.

తొలి బ్యాచ్‌లకు కూడా సర్టిఫికెట్లు అందజేత
ముఖ్య అతిథిగా పద్మ విభూషణ్ డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం హాజరు

సంగారెడ్డి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad) 15వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,398 మంది విద్యార్థులు తమ డిగ్రీ సర్టిఫికెట్లు అందుకోనున్నారు.

B.Tech, M.Tech, M.Sc., PG Diploma, Ph.D కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవంలో డిగ్రీలు ప్రదానం చేయనున్నారు.

ఈసారి B.Tech in IC Design & Technology కోర్సు తొలి బ్యాచ్ విద్యార్థులు, అలాగే IITH–Deakin University Joint Doctoral Programme తొలి బ్యాచ్ పరిశోధకులు కూడా తమ సర్టిఫికెట్లు అందుకోనున్నారు.

ఈ రెండు కార్యక్రమాలకు ఇది తొలి స్నాతకోత్సవం కావడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

స్నాతకోత్సవానికి పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ భరతనాట్య కళాకారిణి, IIT Hyderabad విశిష్ట ప్రొఫెసర్ డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

IIT Hyderabad డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, వివిధ విభాగాల అధిపతులతో కలిసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. రంగురంగుల వేడుకగా ఈ కార్యక్రమం జరగనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media