TG:ఇల్లందు దర్గాలో సీతారామ కళ్యాణం full video

March 28, 2026 11:49 AM

Illandu మండలంలోని సత్యనారాయణపురం సమీప అటవీ ప్రాంతంలో ఉన్న Hazrat Khasim Dulha Nagul Meera Dargahలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు.

కుల, మత భేదాలు లేకుండా దర్గాలో శ్రీరాముల వారి కళ్యాణం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందూ సాంప్రదాయ బద్ధంగా అభిజిత్ లగ్నంలో ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు.భద్రాచలం తరహాలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించి, రాముడు–సీతమ్మవారిని వేర్వేరు ప్రదేశాల నుంచి తీసుకువచ్చి దర్గాలో కళ్యాణం జరిపించారు. హిందూ పూజారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో హిందూ, ముస్లిం భక్తులు కలిసి పాల్గొనడం విశేషం. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై కళ్యాణాన్ని వీక్షించారు.కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. శనివారం శ్రీరాముల వారి పట్టాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media