రాపూరులో అక్రమ లేఅవుట్లపై తహశీల్దార్ హెచ్చరిక

March 6, 2026 11:03 AM

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ పీ. లక్ష్మీనరసింహం హెచ్చరించారు. రాపూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1079లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా లేఅవుట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం అందడంతో అధికారులు వెంటనే స్పందించారు.

సంబంధిత భూమి వద్ద రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, అనుమతి లేకుండా ప్రవేశిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media