పాక్ కు చైనా సాయంపై భారత్ ప్రకటన ఇదే!!

May 12, 2026 8:04 PM

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాంకేతిక సాయం అందించిందన్న వార్తలపై భారత్ స్పందించింది. పాక్ కు సాయం చేయడంలో బీజింగ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది. పాకిస్థాన్‌కు చైనా సహకరించిందనే కథనాలను తాము చూశామని, కానీ ఈ విషయం తమకు ముందే తెలుసని విదేశాంగ శాఖ తెలిపింది. బాధ్యతాయుతంగా ఉన్నామని ప్రకటించుకునే కొన్ని దేశాలు ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న దేశాలకు మద్దతు పలకడం తగదని, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా చేపట్టిందని తెలిపింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని, భారత సైన్యం అదే పని చేసిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అలాంటి ఉగ్ర స్థావరాలను రక్షించేందుకు సాయం చేయడం సరైనదో కాదో ఆయా దేశాలే ఆలోచించుకోవాలని కోరింది. భారత్‌తో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సాయం అందించినట్లు చైనా కూడా అంగీకరించింది. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనాకు చెందిన ఒక ఇంజినీర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media