ఈవీలకు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్: మే నెలలో భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల ఎక్కువ మంది వినియోగదారులు బ్యాటరీ ఆధారిత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నట్లు నోమురా, హెచ్ఎస్బీసీ నివేదికలు తెలిపాయి.
- ప్రయాణికుల వాహనాల విక్రయాల్లో ఈవీల వాటా 6.4 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 4 శాతం.
- ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా 8.9 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇది సుమారు 6.5 శాతం.
- టాటా మోటార్స్ ఈవీ విక్రయాలు ఏడాది క్రితంతో పోలిస్తే 85 శాతం పెరిగాయి. బుకింగ్లు గత రెండు నెలల్లో 2.5 రెట్లు పెరిగాయి.
- టీవీఎస్ మోటార్ సుమారు 42 వేల ఎలక్ట్రిక్ స్కూటర్ రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది.
- ఏథర్ ఎనర్జీ విక్రయాలు రెండింతలకు పైగా పెరిగి 16.5 శాతం మార్కెట్ వాటా సాధించింది.
నోమురా, హెచ్ఎస్బీసీ అంచనా ప్రకారం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వినియోగదారుల ఆమోదం పెరగడంతో దేశంలో ఈవీ వినియోగం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది.

