ఇదేం క్రేజ్ రా సామీ.. 24 గంటల్లోనే అమ్ముడైన టికెట్లు.. ఆ ఇద్దరితో అట్లుంటది మరి!

September 24, 2026 10:37 AM
India West Indies ODIలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

రోహిత్, కోహ్లీ రీఎంట్రీతో పెరిగిన క్రేజ్

భారత్-వెస్టిండీస్ తొలి వన్డేకు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో జరిగే మ్యాచ్ టికెట్లన్నీ కేవలం 24 గంటల్లోనే అమ్ముడయ్యాయి. వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతోందనే చర్చల మధ్య ఈ స్పందన ఆసక్తికరంగా మారింది.

24 గంటల్లోనే హౌస్‌ఫుల్

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి తిరిగి రావడం ఈ మ్యాచ్‌పై ఆసక్తిని మరింత పెంచింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

కేరళ క్రికెట్ అసోసియేషన్ ఈ నెల 17న అధికారిక ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలను ప్రారంభించింది. బుకింగ్ మొదలైన కొద్దిసేపటికే అభిమానులు భారీగా టికెట్లు కొనుగోలు చేశారు. 24 గంటలు పూర్తయ్యేలోపే అందుబాటులో ఉన్న టికెట్లన్నీ అమ్ముడైనట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 27న స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది.

27 నుంచి వన్డే సిరీస్

వెస్టిండీస్‌తో భారత్ సెప్టెంబర్ 27 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ప్రస్తుతం టీ20 జట్టు జపాన్ పర్యటనలో ఉంది. అక్కడ జపాన్‌తో ఏకైక టీ20తో పాటు ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం భారత్, వెస్టిండీస్ జట్లు సెప్టెంబర్ 23 నాటికి తిరువనంతపురం చేరుకోనున్నాయి. అనంతరం ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని మ్యాచ్‌కు సిద్ధమవుతారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీతో తొలి వన్డేకు మరింత హైప్ వచ్చింది.

మూడు ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 27: తిరువనంతపురంలో భారత్-వెస్టిండీస్ తొలి వన్డే.
  • 24 గంటల్లో: మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.
  • రోహిత్-కోహ్లీ: ఇద్దరు స్టార్ బ్యాటర్లు వన్డే జట్టులోకి తిరిగి రావడంతో క్రేజ్ పెరిగింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media