అమెరికాలో 40% ఇండియన్ అమెరికన్ల Mood off…

April 23, 2026 10:48 AM

కార్నెగీ ఎండౌమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ విడుదల చేసిన 2026 “Indian Americans in a Time of Turbulence” నివేదికలో అమెరికాలోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నివేదిక ప్రకారం, 71% మంది ఇండియన్ అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ పనితీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. అలాగే డెమోక్రటిక్ పార్టీపై మద్దతు కూడా తగ్గుతూ 2020లో 52% ఉండగా 2026లో 46%కి పడిపోయింది. ప్రస్తుతం 46% లిబరల్స్‌గా, 30% మోడరేట్‌గా తమను తాము గుర్తించుకుంటున్నారు.

అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే… దాదాపు 40% మంది ఇండియన్ అమెరికన్లు అమెరికాను విడిచి వెళ్లాలని సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. వీరిలో 82% మంది భారత్‌ను ప్రధాన గమ్యంగా చూస్తున్నారు.ఈ నిర్ణయానికి కారణాలుగా రాజకీయ వాతావరణం (58%), జీవన వ్యయం మరియు చైల్డ్‌కేర్ ఖర్చులు (54%), వ్యక్తిగత భద్రత సమస్యలు (41%), అలాగే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ (30–40 సంవత్సరాలు) ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.సర్వే ప్రకారం సుమారు 50% మంది వివక్షను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అందులో 1లో 5 మంది ప్రజల్లో భారతీయ దుస్తులు ధరించడం కూడా మానేశారని వెల్లడైంది.అమెరికాలో సుమారు 5.4 మిలియన్ ఇండియన్ అమెరికన్లు ఉన్నప్పటికీ, వారు దేశపు ట్యాక్స్ బేస్‌లో 6% వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారని నివేదిక పేర్కొంది


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media