ఇండిగో ఎయిర్‌లైన్స్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన భారీ సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ లోపం కారణంగా ఏకంగా 102 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 28 విమానాలు రద్దు.వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 27 విమానాలు రద్దు.మొత్తంగా శంషాబాద్‌లో 55 ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయం వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సాంకేతిక లోపం కారణంగా రద్దు చేయబడిన ముఖ్యమైన సర్వీసులు విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీని నియంత్రించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే తరచుగా టికెట్ బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా వేధించడం, అదనపు రుసుము వసూలు చేయడం వంటి అనేక ఫిర్యాదులు ఇండిగో ఎయిర్‌లైన్స్ పై ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇండిగో సర్వీసెస్ ‘చేతగాని తనం’ మరోసారి బయటపడిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ లోపాన్ని సరిచేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. అయితే, విమాన సర్వీసులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. ప్రయాణికులు ఈ పునఃప్రారంభ సమయాన్ని ఎంతవరకు నమ్మవచ్చనేది ప్రశ్నార్థకంగా మారింది.
