చైనా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2026లో చైనా, అత్యధిక విశ్వవిద్యాలయాలు కలిగిన దేశంగా భారత్‌ను అధిగమించింది. గత రెండేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈసారి రెండో స్థానానికి జారింది.
2026 ఎడిషన్‌లో 25 దేశాల నుండి 1,529 విశ్వవిద్యాలయాలు చోటు చేసుకున్నాయి. చైనా 395 సంస్థలతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 294 సంస్థలతో తరువాతి స్థానంలో నిలిచింది.
పేకింగ్ యూనివర్సిటీ (Peking University) మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కాపాడుకోగా, ఫుడాన్ యూనివర్సిటీ (Fudan University) ఈసారి టాప్ 5లోకి ఎంటరైంది.
భారతీయ సంస్థలలో ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) ఆసియాలో 44వ స్థానంలో నిలిచి దేశంలో అత్యుత్తమంగా నిలిచింది. నిపుణులు చెబుతున్నట్లుగా, భారత విద్యాసంస్థలు పరిశోధనలో మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ గుర్తింపు, విదేశీ విద్యార్థులు-ఫ్యాకల్టీ నిష్పత్తి, సైటేషన్లు వంటి అంశాలలో ఇంకా వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు.కానీ మన దేశంలో చదువు కంటే టాలెంట్ కంటే ప్రోఫెసర్ ను బుజ్జగించే వల్లే పైకి వాచినట్టు పైగా కాలేజీ లో కులవివక్ష చాల ఉన్నట్టు స్టూడెంట్స్ తెలిపారు ,కాలేజీ లో వర్గ రాజకియ్యని డబ్బు రాజకీయం ఉండడం వల్లనే మన విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్ కోల్పోతుంది అని అన్నారు విశ్లేషకులు
మరోవైపు, భారత్‌లో నాణ్యతా పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

