అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. రోడ్ ఐలాండ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
BROWN యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ భవనం, ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్లని దుస్తులు ధరించిన ఓ వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు క్యాంపస్ వ్యాప్తంగా భారీ ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మేయర్ బ్రెట్ స్మైలీ విజ్ఞప్తి చేశారు.ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ TRUMP దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, FBI దర్యాప్తుకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.

ప్రస్తుతం క్యాంపస్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
