మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ప్రకారం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ను ఇరాన్ మూసివేయలేదని, భారత నౌకలను కూడా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నౌకాదళానికి చెందిన IRIS Dena అనే యుద్ధ నౌకను అమెరికా సబ్‌మరైన్ టార్పెడోతో ముంచినట్టు సమాచారం. ఈ ఘటనలో కనీసం 87 మంది నావికులు మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారని శ్రీలంక అధికారులు తెలిపారు.అదే సమయంలో, ఆ దాడి జరిగిన అమెరికా సబ్‌మరైన్‌లో ముగ్గురు ఆస్ట్రేలియా రక్షణ సిబ్బంది ఉన్నారని ఆస్ట్రేలియా ప్రధాని Anthony Albanese వెల్లడించారు. అయితే వారు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘటనతో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి, యుద్ధం ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
