హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక మునిగిన ఘటనతో శ్రీలంక సమీప సముద్ర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా దాడితో ఇరాన్ నౌక మునిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు 87 మంది మృతిచెందగా, పలువురు గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది.
శ్రీలంక నౌకాదళం 32 మందిని రక్షించగా, మిగతా సిబ్బంది కోసం సముద్రంలో శోధన కొనసాగుతోంది. ఇదే ప్రాంతానికి మరో ఇరాన్ నౌక చేరుకుని అత్యవసర సహాయం కోరినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు.ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి తీవ్రంగా స్పందిస్తూ అమెరికా చర్యపై హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో భారత్ సమీపంలో యుద్ధ వాతావరణం నెలకొనడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం సమస్యలకు శాంతియుత పరిష్కారం అవసరమని పేర్కొన్నారు.
