అంతర్జాతీయ వాలంటీర్స్ డే సందర్భంగా, ఐక్యరాజ్య సమితి (UN) మరియు యూత్ ఆఫ్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం (07-12-2025) నాడు విశాఖ బీచ్ రోడ్‌లో ‘వాలంటీర్ స్పిరిట్ రన్’ నిర్వహించారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ సేవాస్ఫూర్తిని (Volunteerism) ప్రోత్సహించాలని మేడపాటి రవీంద్ర పిలుపునిచ్చారు. వాలంటీరిజం అనేది దేశ ప్రగతికి, బాధ్యతాయుత పౌరత్వానికి గొప్ప ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
యూత్ ఆఫ్ భారత్ ఫౌండర్స్ చందన్ మచ్చ, జంపన రంగ రాజు మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో వాలంటీర్ల పాత్ర ప్రధానమని వివరించారు.
ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, సముద్రతీరాల సంరక్షణ, ఆరోగ్యం, సంక్షేమం వంటి లక్ష్యాల సాధనలో పౌరుల సహకారం అత్యవసరమని సూచించారు.
విజేతలకు బహుమతులు:
ముఖ్య అతిథి రవీంద్ర, 5 కి.మీ. వాలంటీర్ స్పిరిట్ రన్ విజేతలకు సర్టిఫికెట్స్ మరియు ప్రైజ్ మనీ అందించారు.
పురుషులు (విజేత): ఎం.ఎస్.జే వేద వ్యాస్.
స్త్రీలు (విజేత): కొర్ర జీవన తన్య (8 సంవత్సరాల బాలిక).
