జల్ జీవన్ మిషన్ 2.0 (JJM 2.0) కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అమరావతి నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆపరేషన్, మెయింటెనెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాగునీటి నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగించినందుకు ప్రధాని Narendra Modiకు కృతజ్ఞతలు తెలిపారు.కేంద్ర జల్ శక్తి మంత్రి C. R. Patil మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈ మిషన్ ద్వారా కోట్లాది కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించామని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘హర్ ఘర్ జల్’ లక్ష్యం సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నీటి నాణ్యత పరీక్షలో డ్వాక్రా మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.తాజా ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో నీటి మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

