జల్ జీవన్ మిషన్‌కు అదనపు నిధులు కావాలి Dycm పవన్ కళ్యాణ్

March 25, 2026 12:53 PM

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ లక్ష్య సాధనకు కేంద్రం మరింత సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు.

జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా పాల్గొన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి అదనపు నిధులు అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 13 లక్షల ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు అందించాల్సి ఉందని తెలిపారు.2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే లక్ష్యాన్ని సాధించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సూచించింది. ఈ లక్ష్య సాధనలో సహకరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media