జమ్మలమడుగులో పోలీసుల కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

February 21, 2026 4:15 PM

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జమ్మలమడుగులో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకే రాజీవ్ నగర్ కాలనీని చుట్టుముట్టిన పోలీసులు ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు.

సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, 8 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులను గుర్తించి, ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడకూడదని వారికి ఎస్డీపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media