పొన్నూరులో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

March 5, 2026 1:54 PM

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మొదటి నాలుగు రోజులలోనే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల సభ్యత్వాలు నమోదు కావడం విశేషమన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ ప్రథమ స్థానంలో ఉన్నారని అన్నారు. అలాగే అరకు ప్రాంతంలో వెనకబడిన వర్గాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ విశేషంగా కృషి చేశారని తెలిపారు.రాష్ట్రంలోని 1600 మంది రైతులకు పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో రూ.16 కోట్ల సహాయం అందించారని వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media