ఇజ్రాయిల్ కు అమెరికా హెచ్చరిక.!

June 19, 2026 12:38 PM
JD Vance speaks on US-Israel diplomatic tensions.

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్ ప్రధాని విమర్శలు

Israel ప్రధాని వ్యాఖ్యలకు అమెరికా ఉపాధ్యక్షుడు JD Vance..

US: అమెరికా ఉపాధ్యక్షుడు JD Vance ఇజ్రాయెల్ కు తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump ప్రభుత్వం ఇరాన్‌తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బహిరంగంగా విమర్శించడంపై అమెరికా ఉపాధ్యక్షుడు స్పందించారు.

ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. “నేను ఇజ్రాయెల్ కేబినెట్‌లో ఉంటే, ప్రపంచంలో నాకు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశాన్ని విమర్శించను” అని వాన్స్ అన్నారు.

గత మూడు నెలల్లో ఇజ్రాయెల్‌ను రక్షించిన రక్షణ వ్యవస్థలలో రెండు-మూడొంతులు అమెరికా తయారు చేసి, అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బుతో సమకూర్చినవేనని గుర్తు చేశారు.అమెరికా సహకారాన్ని ఇజ్రాయెల్ గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు.

నెతన్యాహూ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు?

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి Benjamin Netanyahu ఈ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి.ముఖ్యంగా ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మక పరిమితులు విధిస్తోందని ఆయన భావిస్తున్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ (Ceasefire) ఉంది. ఇరాన్, హెజ్బొల్లాను నియంత్రించి ఇజ్రాయెల్‌పై దాడులు జరగకుండా చూస్తుందని అమెరికా అధికారులు ఆశిస్తున్నారు.

JD వాన్స్ ఇంతకు ముందు కూడా ఇజ్రాయిల్ తీరును తప్పుబట్టారు. “ఒప్పందం కుదిరే దశలో ఉన్నప్పుడు బీరూట్‌లో భారీ పేలుళ్లు జరగడం, హెజ్బొల్లాతో సంబంధం లేని పౌరులు మరణించడం ఆమోదయోగ్యం కాదు.” అన్నారు.

మొత్తం మీద అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్‌తో ట్రంప్ ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందం కారణంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి.

వాన్స్ వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌కు అమెరికా ఇచ్చిన బహిరంగ హెచ్చరికగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media