జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కడప జిల్లా ఖాజీపేటలోని బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. “జేఈఈ అంటే బీరం – బీరం అంటే జేఈఈ” అనే నినాదాన్ని నిజం చేస్తూ 17 మంది విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించారు.
టాప్ స్కోరర్లు: వై. వరుణ్ సందేశ్ (99.83), షేక్ మొహమ్మద్ ఫైజాన్ (99.61), ఎం. వెంకట కార్తీక్ (99.52), వై.పి. కృష్ణ చైతన్య (99.28) వంటి విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత బీరం సుబ్బారెడ్డి, చైర్పర్సన్ సరస్వతమ్మ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. అడ్వాన్స్డ్లోనూ మరిన్ని మెరుగైన ర్యాంకులు సాధించి ఐఐటి, ఎన్ఐటిలలో సీట్లు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్, ప్రిన్సిపాల్స్ హేమ్ చందర్, శ్వేత విద్యార్థులను అభినందించారు.
