జాతీయ పరీక్షల మండలి (NTA) విడుదల చేసిన JEE మెయిన్స్ 2026 (జనవరి సెషన్) ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయభేరి మోగించారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మంది టాపర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు, తెలంగాణ నుండి ఒకరు చోటు దక్కించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ మరియు తెలంగాణకు చెందిన వివాన్ శరద్ మహీశ్వరి 100 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఏపీకి చెందిన దేవ శ్రీవేద్ ఎస్సీ కేటగిరీలో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. హర్యానాకు చెందిన అషి గ్రేవాల్ (99.99 పర్సంటైల్) మహిళల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి సెషన్ పరీక్షకు 13,04,653 మంది (96.26%) విద్యార్థులు హాజరయ్యారు. ఈ సెషన్‌లో స్కోరు తక్కువగా వచ్చిన వారు ఏప్రిల్ 2026లో జరగనున్న రెండో సెషన్ పరీక్షలకు హాజరుకావచ్చు.JEE మెయిన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశం కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సిద్ధం కానున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
