కాంగ్రెస్‌కు షాక్: సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా

March 25, 2026 2:22 PM

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కార్యకర్తల సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు.పార్టీలో జరుగుతున్న ఫిరాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తన మాట వినిపించుకోలేదని జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని సూచించినా పట్టించుకోలేదని పేర్కొన్నారు.తాను మరియు తన కార్యకర్తలు అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తీవ్ర బాధతో పార్టీని వీడుతున్నానని తెలిపారు.అలాగే సీఎం Revanth Reddy నిర్ణయాలపై కూడా విమర్శలు చేశారు. మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటమికి ఈ నిర్ణయాలే కారణమని ఆరోపించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media