ఆంధ్రప్రదేశ్ కాదు…అది ‘స్వర్ణాంధ్రప్రదేశ్ ’ మరో KGF కానున్న AP

April 21, 2026 5:23 PM

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే మొదటి వారంలో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

దాదాపు 598 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్టులో జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ప్రీ-కమర్షియల్ ట్రయల్స్ జరుగుతుండగా, త్వరలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది.ఈ గని ద్వారా ఏటా 1000 నుండి 2000 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 13.1 టన్నుల నిర్ధారిత నిల్వలు ఉండగా, భవిష్యత్తులో ఇది 42.5 టన్నులకు పెరిగే అవకాశముంది. పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే, ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం వెలికితీయవచ్చు.ఓపెన్ కాస్ట్ పద్ధతిలో తవ్వకాలు జరగనున్న ఈ ప్రాజెక్టులో ఆధునిక ‘కార్బన్-ఇన్-లీచ్’ సాంకేతికతను వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా 300-500 మందికి ప్రత్యక్ష ఉపాధి, వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది.దేశంలో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. జొన్నగిరి గని విజయవంతమైతే, మైనింగ్ రంగంలో మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులకు మార్గం సుగమం కానుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media