టాలీవుడ్ స్టార్ హీరో Jr NTR మరియు దర్శకుడు Prashanth Neel కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ ఏడాది మే 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అలాగే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదిక X ద్వారా పోస్టర్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ఫస్ట్ గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
