చిత్తూరు నగరంలో జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూలే బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. మహిళలకు విద్య అవసరం అన్న మాటను ముందుగా చెప్పిన సామాజిక సంస్కర్త పూలే అని, ఆయన సతీమణి సావిత్రీబాయి పూలే దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలని గుర్తుచేశారు.
ఈరోజు బీసీలు ఉన్నత స్థాయుల్లో నిలవడానికి ప్రధాన కారణం పూలే దంపతుల కృషేనని ఎమ్మెల్యే అన్నారు.
కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, రాష్ట్ర నాయకుడు పూసల రవి, పలువురు తెలుగు సంఘ నేతలు పాల్గొన్నారు.
