ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగంపై స్థానిక బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పర్యాటక శాఖ వెచ్చించిన లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని మఠం నిర్వాహకులు బుూడిదలో పోసిన పన్నీరు చేశారని బీజేపీ మండల అధ్యక్షుడు చంద్ర ఓబులరెడ్డి మండిపడ్డారు.

భక్తుల సౌకర్యార్థం పర్యాటక శాఖ సుమారు రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లను మఠం మేనేజర్ రాత్రికి రాత్రే కూల్చివేయడంపై ఓబులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కూల్చేందుకు మేనేజర్‌కు ఎవరిచ్చారు? అని ఆయన నిలదీశారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరుగుదొడ్లను కూల్చివేసిన మఠం మేనేజర్‌పై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు దీనిపై స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ఎత్తున నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. “ఎవరో నిర్మిస్తే.. కూల్చడానికి మేనేజర్ ఎవరు? ఇది ముమ్మాటికీ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే.” – చంద్ర ఓబులరెడ్డి
