చాపాడు మండలంలోని అల్లాడుపల్లె దేవాలయాల వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి.
రహదారిపై స్కూటర్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని తప్పించబోయి, రెండు కార్లు నియంత్రణ కోల్పోయి నేరుగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కార్లలోని ఎయిర్ బ్యాగులు (Airbags) సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కార్లలో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
