జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో కడపకు 1st rank

March 16, 2026 5:02 PM

Kadapa district జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఈ విషయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ Dr. C. Yamini తెలిపారు.

National Legal Services Authority మరియు Andhra Pradesh State Legal Services Authority ఆదేశాల మేరకు మార్చి 14న జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 23 బెంచీల్లో 1,03,343 క్రిమినల్ కేసులు, 248 సివిల్ కేసులు, 53 ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కరించబడ్డాయి.ఈ కేసుల పరిష్కారంతో రూ.24,01,72,158 (24 కోట్లకు పైగా) మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదులు, రెవెన్యూ, పోలీస్, బ్యాంకులు, ఇన్సూరెన్స్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సహకరించినందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media