కడప రిమ్స్ పరిపాలనా విభాగంలో అవినీతి బాగోతం బట్టబయలైంది. సదరం (SADAREM) ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆఫీస్ సూపరింటెండెంట్ మేదర సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు.

వికలాంగుల ధ్రువీకరణ పత్రాల జారీ కోసం వీరు బాధితుల నుండి డబ్బులు డిమాండ్ చేయగా, ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో దాడులు నిర్వహించి రూ. 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడిన ఈ ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిమ్స్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.ప్రభుత్వ సేవలను సామాన్యులకు అందించడంలో లంచాలు డిమాండ్ చేస్తే ఉపేక్షించేది లేదని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
