జిల్లాలో రౌడీయిజాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రొద్దుటూరు పోలీస్ సబ్‌డివిజన్ నేర సమీక్షా సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.

మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజల్లో భయభ్రాంతులు కలిగించేలా హెచ్చరికలు వెళ్లాలని సూచించారు. అక్రమ మద్యం విక్రయించే బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని, బహిరంగ మద్యపానంపై కూడా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలపై డ్రోన్ కెమెరాల సహాయంతో దాడులు నిర్వహించాలని సూచించారు.రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిఘా ఉంచి, అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ హెల్మెట్, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్‌పై తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
