ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే కడప జిల్లా వాసులు అక్రమ ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. టూరిస్ట్ వీసాల పేరుతో మహిళలను విదేశాలకు పంపి, అక్కడ వేధింపులకు గురిచేస్తున్న అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
PGE (Protector General of Emigrants) ద్వారా గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశీ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పని కోసం వెళ్లేవారు కేవలం వర్క్ వీసా లేదా ఎంప్లాయిమెంట్ వీసా మీద మాత్రమే వెళ్లాలి. అక్రమ ఏజెంట్లు లీగల్ ప్రాసెస్ తప్పించుకోవడానికి టూరిస్ట్ వీసాపై పంపి మోసం చేస్తున్నారని గమనించాలి. ఇప్పటికే విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారు లేదా వారి బంధువులు Madad web-portal నందు ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. అక్రమ ఏజెంట్ల గురించి తెలిస్తే స్పెషల్ బ్రాంచ్ అధికారుల నంబర్లు 9121100504 లేదా 9121100652 కు సమాచారం అందించాలి.అమాయక మహిళలను టార్గెట్ చేసి విదేశీ ఏజెంట్లకు విక్రయిస్తున్న ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు.
