శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభ రాయుడి కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.

స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి సవితమ్మ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, కలెక్టర్ శ్యాంప్రసాద్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే పరిటాల సునీత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు.
