కడియంలో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్న YSRCP నేతలు

March 25, 2026 2:03 PM

కడియం మండలం పొట్టిలంక గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మట్టి లారీలు, జేసీబీలను నిలిపివేశారు.

సర్వే నంబర్ 147లో నది గర్భంలోని మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతూ తరలిస్తున్నారని ఆరోపించారు. ఎన్జీటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.అనుమతుల పేరుతో భారీగా మట్టిని తవ్వి బయట విక్రయిస్తున్నారని, వందల లారీలతో పంట పొలాల నుంచి మట్టిని తరలిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media