కాకినాడలో అర్ధరాత్రి ఘర్షణ
Kakinada : కాకినాడ నగరంలో స్నేహితుల మధ్య జరిగిన చిన్న(Minor) వివాదం విషాదానికి దారితీసింది. భానుగుడి సెంటర్‌లో సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సతీష్‌కు అతని స్నేహితుడు, జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న సాయికిరణ్‌తో చిన్న వివాదం తలెత్తింది.
మాటామాటా పెరిగి ఘర్షణ
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. గొడవ తీవ్రరూపం దాల్చడంతో సాయికిరణ్ కర్రతో సతీష్‌పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భానుగుడి సెంటర్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.
హత్యకు కారణాలపై దర్యాప్తు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం Kakinada ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. హత్యకు దారితీసిన అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్నేహితుల మధ్య జరిగిన చిన్న(Minor) వివాదం చివరకు హత్యకు దారితీయడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



