Kakinada districtలో విషాద ఘటన చోటుచేసుకుంది. Kotananduru మండలం కాకరపల్లి గ్రామంలోని తమ్మయ్య చెరువులో మహిళతో పాటు ఐదు సంవత్సరాల బాలిక మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారా లేదా కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఘటన స్థలంలో లభించిన బట్టలు, బ్యాగ్ ఆధారంగా మృతుల వివరాలను గుర్తించి బంధువులకు సమాచారం అందించారు.
