రెవిన్యూ సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్: MLA కురుగొండ్ల

March 11, 2026 11:42 AM

Kaluvayiలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో Kurugondla Ramakrishna పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 15 మంది లబ్ధిదారులకు రూ.8,19,537 చెక్కులు అందజేశారు. రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ రీ-సర్వేలో జరిగిన పొరపాట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media