తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్పై లైంగిక దాడి ఆరోపణలతో తీవ్ర కేసు నమోదైంది. హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ప్రకారం, కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకున్న ఎస్ఐ, అనంతరం బాధితురాలి ఇంటికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇటీవల మరో వివాదంలో సస్పెండ్ అయిన ఈ అధికారి పై తాజా ఆరోపణలు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.
