తమిళనాడులో కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన సభ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు, 60 మందికి పైగా గాయపడ్డారు.
నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ నిర్వహించిన సభకు సంబంధించి, సీబీఐ 306 మందికి సమన్లు జారీ చేసింది, వీరిలో మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, పార్టీ సభ్యులు కూడా ఉన్నారు.
సీబీఐ సభా నిర్వాహకులు, భద్రతా ఏర్పాట్లు, అధికారుల పాత్రను పరిశీలిస్తూ, తాత్కాలిక క్యాంప్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఘటనా స్థలం పరిశీలన, ప్రత్యక్ష సాక్ష్యాల వంగ్మూలాలు సేకరణ పూర్తయ్యాయి.

