కేదార్‌నాథ్, బద్రీనాథ్: భారీ వర్షాల నేపథ్యంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ తీర్థయాత్రలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా యాత్రలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయాలకు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్రికుల వాహనాలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.



