గాఢాంధకారం.. కొండ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి

August 20, 2026 4:30 PM
Kenya helicopter crash site in a mountainous forest region.

సెంబూరు కౌంటీలో ఘోర ప్రమాదం
  • కెన్యాలో టూరిస్ట్ హెలికాప్టర్ ప్రమాదం.. ఏడుగురు మృతి
  • ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన భార్యతో పాటు అమెరికన్ పర్యాటకులు మృతి
  • చీకటి, దట్టమైన అడవులు, కొండల కారణంగా రెస్క్యూ చర్యలకు ఆటంకం
హెలికాప్టర్‌తో తెగిపోయిన ఏటీసీ సంబంధాలు

కెన్యా రాజధాని నైరోబీకి ఉత్తరంగా ఉన్న ‘లోయిసాబా వైల్డ్‌లైఫ్ రిజర్వ్’ నుంచి బుధవారం ఉదయం టూరిస్ట్ హెలికాప్టర్ బయలుదేరింది.

అందులో ఒక పైలట్, ఆరుగురు పర్యాటకులు ఉన్నారు. కొండలు, కోనల మీదుగా ప్రయాణం కొనసాగుతుండగా సెంబూరు కౌంటీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో పైలట్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.

కొద్దిసేపటికే హెలికాప్టర్ నేలకూలి పూర్తిగా ధ్వంసమైంది. ఎత్తైన కొండ, అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు.

విమానంలో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో ఈక్వెడార్ దేశానికి చెందిన ఛీఫ్ ఇంటెలిజెన్స్ అధికారి, ఆయన భార్యతో పాటు ఐదుగురు అమెరికన్ పర్యాటకులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురూ మృతి చెందారు.

ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని కెన్యా ప్రమాద దర్యాప్తు శాఖ డైరెక్టర్ ఫెడ్రిక్ కబుంగే తీవ్ర విచారం వ్యక్తం చేసారు.

చీకటి, దట్టమైన అడవులతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించాయి.

అయితే అక్కడ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

అదే సమయంలో చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

ప్రమాదానికి కారణమేంటి?

హెలికాప్టర్ కూలిపోవడానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. వాతావరణంలో మార్పుల వల్ల ప్రమాదం జరిగిందా? లేక సాంకేతిక లోపం కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హఠాత్తుగా కూలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ (KCAA) ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media