ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మైనర్లు మృతి

August 22, 2026 5:43 PM
Damaged bike involved in Khammam road accident, two minors dead

ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిపై ప్రమాదం
కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి.. చికిత్స పొందుతూ మరొకరు మృతి

ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మైనర్లు (Two Minors) మృతి చెందారు.

బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. :

పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని గ్రీన్ కాలనీకి చెందిన ( Two minors) గుండేటి శ్రీనివాస్ (18), ఖమ్మం నగరంలోని రామనగుట్ట ప్రాంతానికి చెందిన తన బంధువు గర్లపాటి రిషిక (10)తో కలిసి బైక్‌పై కాలనీకి వెళ్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది.

రిషిక అక్కడికక్కడే మృతి:

కారు ఢీకొనడంతో గర్లపాటి రిషిక (10) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్‌ను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

కేసు నమోదు:

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media