ఉత్తర కొరియా నాయకుడు Kim Jong Un కూతురు భవిష్యత్ వారసురాలిగా మారే అవకాశాలపై చర్చలు మళ్లీ జోరందుకున్నాయి.

దక్షిణ కొరియా గూఢచారి సంస్థ National Intelligence Service (NIS) తాజా అంచనాల ప్రకారం, కిమ్ కూతురు వారసురాలిగా అంతర్గతంగా ఎంపిక దశలో ఉన్నట్లు సమాచారం.ఆమెను సాధారణంగా Kim Ju Aeగా గుర్తిస్తున్నారు. సుమారు 13 ఏళ్ల వయసున్న ఈ బాలిక 2022 నుంచి తన తండ్రితో పలు ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తూ, రాజకీయ ప్రాధాన్యత పెంచుకుంటోంది.మిసైల్ పరీక్షలు, సైనిక తనిఖీలు, ఫ్యాక్టరీ సందర్శనల్లో పాల్గొంటూ, ఆమెను నాయకత్వానికి సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు మహిళా సుప్రీం లీడర్ లేని నేపథ్యంలో, ఇది కీలక మార్పుగా భావిస్తున్నారు.ఇప్పటివరకు కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచిన కిమ్, తన భార్య Ri Sol Juను కూడా పెళ్లి తర్వాతే ప్రజలకు పరిచయం చేశారు.ప్రస్తుతం ఈ అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది.
