ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నార్త్ అమెరికా స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా కోమటి జయరాం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో వేద ఆశీర్వచనాల మధ్య జరిగిన కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షుడు వేమూరి రవి, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ రవి మండలపు, ప్రముఖ ఎన్నారై డాక్టర్ రాజా పిల్లి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కోమటి జయరాం సేవలు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
