Kothapetaలో Mandali Buddha Prasadకు ఘన సత్కారం జరిగింది. తెలుగుభాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా టిడిపి నాయకులు మరియు స్థానికులు సన్మానం చేశారు.
రాజమహేంద్రవరం బొమ్మూరులోని Potti Sreeramulu Telugu Universityలో Potti Sreeramulu విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, విగ్రహ శిల్పి రాజకుమార్ ఉడయార్ ఆహ్వానం మేరకు కొత్తపేటలోని శిల్పశాలను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సందర్శించారు.ఈ సందర్భంగా కొత్తపేట ఏఎంసీ వైస్ చైర్మన్ కంఠం శెట్టి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కరరావు, ఉపసర్పంచ్ విల్ల మారుతి ప్రసాద్, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మిద్దె ఆదినారాయణతో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు
